బ్యూటీ టిప్స్ చెబుతున్న భామ

Nabha Natesh shares beauty tips during quarantine period
Sunday, April 5, 2020 - 15:30

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా రకరకాల పనులు పెట్టుకున్నారు. ఎక్కువమంది యోగా, తిండికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే మరికొంతమంది అందానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ రెండో టైపు. తాజాగా ఓ బ్యూటీ టిప్ తో మనముందుకొచ్చింది ఈ భామ. దాన్ని తను పాటించడమే కాకుండా.. అంతా పాటించాలని కోరుతోంది.

ఇంతకీ ఈరోజు నభా ఏం చేసిందంటే.. రెండు ఎగ్ వైట్స్ (తెల్ల సొన)లో కాస్త కొబ్బరినూనె కలిపి తలకు పట్టించిందంట. అంతే.. ఆమె కురులు అందంగా తయారైపోయాయంటోంది. సముద్రంలో అలల్లా తన కురులు అందంగా మారిపోయాయని, ఈ చిన్న చిట్కాను అందరూ పాటించాలని చెబుతోంది. లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లోనే ఉంటూ అంతా ఇలాంటి చిన్నచిన్న ప్రయోగాలు చేయాలని అంటోంది.

రోజుకొక ఐటెమ్ తో తన ఫ్యాన్స్ ను పలకరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొన్నటికిమొన్న తన బెడ్ రూమ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. అంతకంటే ముందు యోగా చేసింది. ఇంకో రోజు క్రేయాన్స్ మధ్య ఫొటో దిగి పోస్ట్ చేసింది. ఉగాది రోజు చీరకట్టుతో పలకరించింది. ఇలా తనకు బోర్ కొట్టకుండా, తన అభిమానులకు బోర్ కొట్టించకుండా సోషల్ మీడియాలో ఎంగేజ్ అవుతోంది ఈ చిన్నది.