ప్రభాస్ నుంచి మరో అప్ డేట్

Nag Ashwin to announce an update about Prabhss's movie
Friday, July 10, 2020 - 18:45

ప్రస్తుతం "రాధేశ్యామ్" ట్రెండింగ్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎట్టకేలకు ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ రావడంతో ఫ్యాన్స్ శివాలెత్తిపోతున్నారు. భూమి-ఆకాశం చూడడం లేదు. ఫ్లెక్సీలు, స్క్రీన్ సేవర్లు, బైక్ స్టిక్కర్లు, ఫోన్ కవర్లు.. ఇలా గంటల్లో వివిధ రూపాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడీ హంగామాను డబుల్ చేయబోతున్నాడు ప్రభాస్

అవును.. ఈ నెలలోనే ప్రభాస్ నుంచి మరో అప్ డేట్ రాబోతోంది. ఈరోజు రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్.. ఈ నెలలోనే (మరో 2 వారాల్లో) నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు నాగ్ అశ్విన్ చిన్న ఫీలర్ వదిలాడు

ప్రభాస్ తో పాన్-వరల్డ్ సినిమా ఎనౌన్స్ చేశాడు నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో సూపర్ మేన్ స్ఫూర్తితో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈ నెలలోనే ఓ మంచి అప్ డేట్ ఇవ్వబోతున్నానని నాగ్ అశ్విన్ ప్రకటించాడు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసిన ఈ దర్శకుడు.. ఏ అప్ డేట్ ఇవ్వబోతున్నాడా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.