నాగ్ అభిమానుల వ‌ర్రీ

Nag fans request to change the release date of Manmadhudu 2
Tuesday, June 18, 2019 - 20:45

నాగార్జున న‌టిస్తున్న "మ‌న్మ‌ధుడు 2" టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లయింది. ఈ టీజ‌ర్ రిలీజ్‌తో పాటే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు మేకర్స్‌. మ‌న్మ‌ధుడు 2 ఆగ‌స్ట్ 9న రిలీజ్ అవుతుంద‌ని చెప్పారు. ఐతే ఆరు రోజుల‌కే ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో విడుద‌ల కానుంది. సాహో కోసం మ‌న్మ‌ధుడు 2ని మ్యాగ్జిమ‌మ్ థియేట‌ర్ల‌లో నుంచి ఎగ్జిబిట‌ర్లు లేపేస్తార‌ని ఫ్యాన్స్ వ‌ర్రీ అవుతున్నారు. డేట్ మార్చ‌మ‌ని అడుగుతున్నారు.

కానీ నాగార్జున మాత్రం ఇదే స‌రైన డేట్ అంటున్నాడ‌ట‌. అన్ని ర‌కాలుగా ఆలోచించే ఈ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించామ‌ని అంటున్నాడు నాగ్‌. ఒక్క‌సారి సినిమాని వాయిదా వేస్తే...మిగ‌తా సినిమాల‌తో పోటీప‌డాలి. దాదాపుగా ప్ర‌తివారం ఏదో ఒక సినిమా ఉంది. అందుకే అభిమానుల‌కి రిలీజ్ డేట్ విష‌యంలో ఏ హామీ ఇవ్వడం లేదు నాగ్‌.

నాగార్జున ఈ సినిమాలో పెళ్లికాని ప్ర‌సాద్ పాత్ర పోషిస్తున్నాడు. త‌ల్లి, సిస్ట‌ర్స్...పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి చేయ‌డంతో రెంట్‌కి భార్య‌ని తెచ్చుకుంటాడ‌ట‌. ఈ వెరైటీ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.