నాగబాబు డిలీట్ చేసిన ట్వీట్ ఇదే

Naga Babu deletes tweet on Balakrishna
Wednesday, June 10, 2020 - 14:15

బాలయ్యపై ట్వీట్ పెట్టి డిలీట్ చేశాడు

ఈరోజు బాలయ్య షష్టిపూర్తి. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. చివరికి కొన్ని రోజులుగా బాలయ్యతో పరోక్షంగా విమర్శలు ఎదుర్కొంటున్న చిరంజీవి కూడా మనసారా అతడికి శుభాకాంక్షలు చెప్పారు. అయితే నాగబాబు మాత్రం బాలయ్య పై ఓ ట్వీట్ ఇలా పెట్టి అలా డిలీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటో తెలుసా..?

"కారోన జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం circulate అవుతుందిరా అయ్యా. జాగ్రత్తరా అయ్యా..దండం పెడతాను...అయ్యబాబోయ్ చిన్న పిల్లలని old age వాళ్ళని,హెల్త్ బాగలేని వాళ్ళని సంగీతం వినకుండా చూసుకోండి.విన్నారంటే ఏదేన జరగొచ్చు.....అయినా ఎందయ్యా ఇది..ఇది నేను చూళ్లే..ఎక్కడ ఇనలే." అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు నాగబాబు.

ఇలా బాలయ్య పాడిన పాటపై సెటైర్ వేసి, ఆ వెంటనే దాన్ని డిలీట్ చేశారు నాగబాబు. పుట్టినరోజుతో వ్యక్తిగత విమర్శలు ఎందుకు అనుకున్నారో లేక ట్వీట్ లో వాడిన భాష బాగాలేదని ఫీల్ అయ్యారో కానీ నాగబాబు మాత్రం ఆ ట్వీట్ ను డిలీట్ చేయడానికే మొగ్గుచూపారు.

భూములు పంచుకుంటున్నారంటూ బాలయ్య చేసిన విమర్శపై  భారీ ఎత్తున విరుచుకుపడిన నాగబాబు.. బాలయ్య పాడిన పాటపై మాత్రం తన స్పందనను ట్విట్టర్ నుంచి తొలిగించారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తోంది.