నాగబాబుకి కరోనా ఎఫెక్ట్

Naga Babu gets trolling over corona tweet
Thursday, March 5, 2020 - 15:45

నాగబాబు మాట్లాడితే పవన్ గురించి లేదంటే చిరంజీవి గురించి మాట్లాడతారు. ఈ రెండూ తప్పితే ఆయన "అదిరింది" అనే తన షో గురించి లేకపోతే ప్రతిపక్షాల విమర్శలపై సెటైర్లు వేస్తూ "అంతా నా ఇష్టం" అంటారు. అంతే తప్ప... రామ్ గోపాల్ వర్మ టైపులో అసందర్భ ట్వీట్లు రావు. కరోనా విషయంలో అలా చేసి ట్రోలింగ్ కి గురి అయ్యారు. 

"దేవుడి భక్తుల కి నా ఛాలెంజ్. ఎక్కువ గా గ్రూప్స్ గా వుండొద్దు అని ప్రభుత్వం వారి సూచన..సో మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మీ  ప్రార్ధనాలయాలకి గ్రూప్స్ గా వెళ్లి పూజలు ,ప్రార్ధనలు,prayers చెయ్యండి.ప్రసాదాలు, తీర్థాలు,స్వీకరించండి.సేఫ్ గా ఉంటే దేవుడు గొప్ప తేడా అయితే కారోన వైరస్ గొప్ప."

చూశారుగా.. స్వయంగా నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్ట్ ఇది. ఇది చూసి నిజంగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నాగబాబు నుంచి ఇలాంటి ట్వీట్స్ ను ఫ్యాన్స్, జనసైనికులు మాత్రమే కాదు.. ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. సాధారణంగా నాగబాబు ఓ స్టేట్ మెంట్ ఇచ్చినా, కామెంట్ చేసినా దానిపై చాలా చర్చ జరుగుతుంది. విమర్శించే వాళ్లు ఎంతమంది ఉంటారో, మద్దతిచ్చే వాళ్లు కూడా అంతేమంది ఉంటారు.

కానీ ఈ తాజా ట్వీట్ పై మాత్రం నాగబాబుకు ఒక్కరంటే ఒక్కరి మద్దతు కూడా దక్కలేదు. అంతా ఈ మెగా బ్రదర్ ను ఆడిపోసుకుంటున్నారు. మనకు ఇలాంటి ట్వీట్స్ అవసరమా సర్ అంటూ కొందరు సుతారంగా కామెంట్స్ పెడితే, మరికొందరు మాత్రం కాస్త గట్టిగానే తగులుకున్నారు. దిమాక్ ఖరాబ్ అయిందా అంటూ తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

నాగబాబు విచక్షణ లేకుండా ట్వీట్ పెట్టినా, జనసైనికులు, మెగా ఫ్యాన్స్ మాత్రం దానిపై హుందాగా స్పందిస్తున్నారు. నాగబాబు గారు మీ పోస్ట్ బాగాలేదు, మేం సపోర్ట్ చేయం అంటూ గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇది నిజంగా ఆయనకు వచ్చిన ఐడియానేనా లేక ఏదో జోక్ చేయాలనుకుంటే ఇలా రివర్స్ అయిందా.. మెగా బ్రదర్ కే తెలియాలి.