ఒకే సినిమాతో రెండు మేకోవర్లు

Naga Chaitanya and Lavanya get makeover
Monday, July 3, 2017 - 15:15

నాగచైతన్య కొత్త సినిమా 'యుద్ధం శరణం'. సినిమా కాన్సెప్ట్ కాస్త కొత్తదే. నాగచైతన్య, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించారిందులో. ఈ సినిమాతో హీరోహీరోయిన్లిద్దరూ కొత్త మేకోవర్లు ట్రై చేస్తున్నారు. హీరో ఏమో యాక్షన్-మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం. అటు హీరోయిన్ అల్ట్రా గ్లామరస్ ఇమేజ్ కోసం ట్రయింగ్. ఇద్దరికీ ఈ సినిమానే కీలకం.

ఫస్ట్ నాగచైతన్య విషయానికొద్దాం. ఈ హీరో మాస్ ఇమేజ్ కోసం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ పెద్దగా క్లిక్ అవ్వడం లేదు. దడ, ఆటోనగర్ సూర్య, బెజవాడ.. ఇలా చాలా యాక్షన్ సినిమాలు చేశాడు. తడాఖా మినహాయిస్తే మిగతావేవీ పెద్దగా కలిసిరాలేదు. ఇప్పుడు 'యుద్ధం శరణం' మూవీతో మరోసారి ఆ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.

ఇక లావణ్య త్రిపాఠి విషయానికొస్తే, ఇన్నాళ్లూ గర్ల్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ తోనే కొనసాగింది. పద్ధతైన పాత్రలు, సంప్రదాయ దుస్తులు ఇవే. ఈమధ్యే పిల్ల కాస్త ట్రాక్ మార్చింది. గ్లామరస్ గా ఉండే గార్మెంట్స్ వేస్తోంది. పనిలోపనిగా కాస్త ఎక్స్ పోజింగ్ కూడా చేస్తోంది. యుద్ధం శరణం సినిమాలో కంప్లీట్ గ్లామర్ లుక్ లో కనిపించనుంది లావణ్య. ఈ సినిమా సక్సెస్ అయితే గ్లామర్ డాల్ ఇమేజ్ అందుకుంటుంది