ఆర్మీ రోల్ కలిసొచ్చేనా!

Naga Chaitanya and Mahesh as army officers
Monday, December 2, 2019 - 08:15

తన కొత్త సినిమాలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అటు మహేష్ కూడా తన అప్ కమింగ్ మూవీలో ఆర్మీ మేన్ గా కనిపిస్తున్నాడు. సినిమాల సంగతి పక్కనపెడితే, ఈ గెటప్స్ పై మాత్రం ఇప్పుడు చాలామందికి చాలా అనుమానాలున్నాయి. దీనికి కారణం ఆర్మీ గెటప్ పెద్దగా కలిసి రాకపోవడమే.

ఆమధ్య ఆర్మీ రోల్ లో బన్నీ కనిపించాడు. నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. కట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు నాగచైతన్య, మహేష్ ఒకేసారి తమ అప్ కమింగ్ మూవీస్ లో సేమ్ గెటప్స్ రిపీట్ చేస్తున్నారు. కనీసం వీళ్లయినా ఈ సైనిక అవతారాలతో సక్సెస్ కొడతారా అనేది చూడాలి

ఒకవేళ నాగచైతన్య, మహేష్ కూడా ఆర్మీ గెటప్స్ తో సక్సెస్ అందుకోలేకపోతే.. రాబోయే రోజుల్లో ఈ పాత్ర పోషించడానికి ఇక మరే హీరో ముందుకు రాకపోవచ్చు. నాగచైతన్య చేస్తున్న వెంకీ మామ, మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలపై ఎంత పాజిటివ్ బజ్ నడుస్తున్నప్పటికీ.. పంటికింద రాయిలా ఈ నెగెటివ్ సెంటిమెంట్ మాత్రం అభిమానుల్ని భయపెడుతూనే ఉంది. ఈసారికి ఈ నెగెటివ్ సెంటిమెంట్ తన ప్రభావం చూపించకూడదనే కోరుకుందాం.