చైతన్య, సమంతకు కరోనా లేదు

Naga Chaitanya and Samantha deny corona rumors
Thursday, June 25, 2020 - 19:00

2 రోజుల కిందటి సంగతి. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా సోకింది. ఆమె భర్తకు కూడా పాజిటివ్ అని తేలింది. ఈ సంగతి తెలిసి అక్కినేని అభిమానుల గుండె జారిపోయింది. ఈ విషయంలో శిల్పారెడ్డికి అక్కినేని ఫ్యాన్స్ కు చిన్న లింక్ ఉంది. అదేంటంటే.. తనకు కరోనా సోకిందని శిల్పారెడ్డి ప్రకటించడానికి 2 రోజుల ముందు.. ఆమెను గట్టిగా కౌగిలించుకొని సమంత ఫొటో దిగింది. పనిలోపనిగా ఓ ముద్దు కూడా ఇచ్చేసింది. అభిమానుల టెన్షన్ కు ఇదే కారణం.

శిల్పారెడ్డికి కరోనా అని తెలియడంతో అంతా సమంతకు కూడా కరోనా సోకి ఉంటుందని, కాబట్టి ఆటోమేటిగ్గా నాగచైతన్యకు కూడా పాటిజివ్ వచ్చి ఉంటుందని అనుమానించారు. అయితే దీనికి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

అయితే ఈ వార్తలకు కొనసాగింపుగా.. అక్కినేని కాంపౌండ్ నుంచి మరో మంచి లీక్ వచ్చింది. అదేంటంటే.. తాజాగా చై-శ్యామ్ ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారట. టెస్టుల్లో వాళ్లకు నెగిటివ్ వచ్చిందట.

ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడే సమంత, ఈ మేటర్ పై మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. ఆమె అలా దాచుకునే రకం కాదు. కచ్చితంగా రేపోమాపో దీనిపై ఆమె క్లారిటీ ఇస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

|

Error

The website encountered an unexpected error. Please try again later.