మామకు ప్రేమతో

Naga Chaitanya Shows his affection on Venky
Monday, July 17, 2017 - 17:45

నాన్నకు ప్రేమతో అనేది హిట్ సినిమా. కానీ ఇక్కడ నాగచైతన్య మాత్రం మామకు ప్రేమతో అంటూ సాంగేసుకుంటున్నాడు. దీనికి కారణం విక్టరీ వెంకటేశ్. వెంకీ అంటే నాగచైతన్యకు ఎంతిష్టమో చాలామందికి తెలుసు. ఇప్పుడంటే సమంతతో ఎంజాయ్ చేస్తున్నాడు కానీ, ఒకప్పుడు ఫ్రీ టైం దొరికితే చాలు.. వెంకీ ఇంటికే వెళ్లిపోయేవాడు చైతూ. తిండి, నిద్ర, రానాతో ఆటలు.. అన్నీ అక్కడే. 

ఇప్పుడివన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. కేవలం మామ మీద మమకారంతోనే యుద్ధం శరణం సినిమా చేస్తున్నాడట నాగచైతన్య. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు చైతూ. నిజానికి కృష్ణ మరిముత్తు ఈ సినిమాను వెంకీతో తీద్దామనుకున్నాడట. కుదరకపోతే రానాతో ప్లాన్ చేశాడట. కానీ స్క్రిప్ట్ విన్న తర్వాత ఇది నాగచైతన్యకు అయితే సరిగ్గా సూట్ అవుతుందని.. కృష్ణను చైతూకు ఎటాచ్ చేశాడట వెంకీ.

తనపై, తన కెరీర్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న వెంకీ అంటే తనకు ఎప్పుడూ అభిమానమే అంటున్నాడు చైతూ. కేవలం మామ చెప్పాడనే యుద్ధం శరణం సినిమా చేస్తున్నానని ప్రకటించాడు.