నాగ శౌర్య ఆగిపోలేదంట

Naga Shaurya movie not scrapped
Thursday, February 27, 2020 - 08:45

నాగ శౌర్య సినిమా ఆగిపోయిందంటూ మీడియాలో వచ్చిన వార్తలని నిర్మాతలు తప్పు అని ప్రకటించారు. శౌర్య హీరోగా నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస రావు మొదలు పెట్టిన "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" సినిమా ఆగిపోయింది అని వార్తలు రావడానికి ఓ రీజన్ ఉంది. ఈ సినిమా చాన్నాళ్ల కింద స్టార్ట్ అయింది కానీ ఆ తర్వాత దాని ఊసే లేదు. నిర్మాతలు మాట్లాడడం లేదు, హీరో అసలు చెప్పడం లేదు. నాగ శౌర్య నెక్స్ట్ సినిమాలు ఇవి అంటూ రకరకాల మూవీస్ షురూ చేస్తున్నాడు కానీ దీనిగురించి నోరు విప్పట్లేదు. 

దాంతో, ఈ పుకార్లు మొదలు అయ్యాయి. ఐతే, తమ సినిమా ఆగిపోలేదని సహనిర్మాత వివేక్ కూచిబొట్ల ట్వీట్ చేశారు. "ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. మిగతా భాగం అంతా అమెరికాలో తీయాలి. వీసాలు ఇంకా రాలేదు. దానికోసం వెయిటింగ్. అంతే తప్ప మూవీ ఆగిపోలేదు," అని క్లారిటీ ఇచ్చారాయన. 

నాగ శౌర్యతో ఇప్పటికే అవసరాల రెండు సినిమాలు - "ఊహలు గుస గుసలాడే", "జ్యో అచ్యుతానంద" -  డైరెక్ట్ చేశాడు. ఇది మూడో చిత్రం.