నాగశౌర్యకి ఫైన్‌ వేసిన పోలీసులు

Naga Shourya fined for black film
Tuesday, August 13, 2019 - 18:30

నిబంధనలకి విరుద్దంగా కారు అద్దాలకి బ్లాక్‌ ఫిలింని పెట్టాడు హీరో నాగశౌర్య. కారులో ప్రయాణిస్తున్నపుడు అభిమానులు వెంట పడుతారని సినిమా తారలంతా తమ కార్లకి బ్లాక్‌ ఫిలిమ్‌ని అంటించారు. ఐతే ఇది రూల్స్‌కి వ్యతిరేకం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో హీరో నాగ శౌర్య కారుకు ఐదు వందల రూపాయలు ఫైన్ వేశారు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు అధికారి. అంతేకాదు, బ్లాక్ ఫిలిమ్స్ తొలగించారు పోలీస్. అంటే ఇపుడు నాగశౌర్య కారు అందరి కార్లలాగే ఉంటుంది. 

అతని ఫోర్డ్‌ ఎండీవర్‌ టైటానియం కారుని పోలీసులు పట్టుకున్నారు. ఐతే ఆ టైమ్‌లో నాగశౌర్య అందులో లేడు. నాగశౌర్య ప్రస్తుతం సోలో హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.