నాగ‌శౌర్య మ‌ళ్లీ హోమ్ బాట‌

Naga Shourya producing another film
Saturday, May 4, 2019 - 23:30

"ఛ‌లో" సినిమా త‌ర్వాత నాగ‌శౌర్య ఓ రేంజ్‌లో హ‌డావుడి చేశాడు. ఈ కుర్ర‌హీరో కెరియ‌ర్ కుద‌ట‌ప‌డిన‌ట్లే అనిపించింది. వ‌రుస‌గా సినిమాలు, ఒక హీరోయిన్‌తో డేటింగ్ వంటి వల్ల గ‌తేడాది చాలా హంగామా చేశాడు. అంతా సాఫీగా వెళ్తుంద‌నుకున్న టైమ్‌లో "న‌ర్త‌న‌శాల" వ‌చ్చి దెబ్బ‌కొట్టింది. సొంత బ్యాన‌ర్‌పైనే న‌ర్త‌న‌శాల నిర్మించాడు. ఐతే గే కామెడీ గాడి త‌ప్పి ఝాడించి కొట్టింది. అలాగే ఒక సినిమా కొద్ది రోజులు షూటింగ్ జ‌రుపుకొని ఆగింది. ఇలా వ‌రుస దెబ్బ‌ల‌తో సైలెంట్ అయ్యాడు.

ఇపుడిపుడే అన్నీ సెట్ చేసుకుంటున్నాడు. మ‌రోసారి కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ ఆయ‌న త‌న హోమ్ బ్యాన‌ర్‌ని సెట్‌రైట్ చేస్తున్నాడు. వ‌చ్చేవార‌మే ఈ కొత్త సినిమా షురూ కానుంది. నాగ‌శౌర్య తాజ‌గా చేస్తున్న మూవీతో పాటు ఈ మూవీ కూడా కెరియ‌ర్‌ని చ‌క్క‌దిద్దుతుంద‌ని ఆశిద్దాం.

ఇండ‌స్ట్రీలో 10 కోట్లు ఆ రేంజ్‌ మార్కెట్ ఉన్న‌హీరోల కొర‌త బాగుంది. నాగ‌శౌర్య‌, నిఖిల్ వంటి హీరోలు కాస్త నిల‌దొక్కుకుంటే చిన్న సినిమాల నిర్మాణం ఊపందుకుంటుంది.