రాజమౌళి కోసం నాగార్జున లాబీయింగ్?

Nagarjuna lobbies for his son Akhil
Wednesday, May 10, 2017 - 15:30

రాజమౌళి కేవలం ఇప్పుడు ఓ దర్శకుడు మాత్రమే కాదు. ఆయ‌నొక‌ బ్రాండ్. జక్కన్నతో సినిమా చేసేందుకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో పరితపిస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి 2తో రికార్డుల  మీద రికార్డులు సృష్టిస్తున్న రాజమౌళి.. నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తాడు? దీనిపై చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది. కొందరు ఎన్టీఆర్ పేరు చెబుతుంటే, మరికొందరు రణ్వీర్ సింగ్, ప్రభాస్ పేర్లు వినిపిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తమ ప్రయత్నాలు ఆపడం లేదు.

రాజమౌళి కోసం ట్రైచేస్తున్న పెద్ద మనుషుల్లో నాగార్జున ముందువరుసలో ఉన్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అఖిల్ ను రాజమౌళికి అప్పగించాలని నాగ్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. కానీ బాహుబలి ప్రాజెక్టు వల్ల అది సాధ్యంకాలేదు. ఇప్పుడు బాహుబలి ఫ్రాంచైజీ ముగిసిపోవడంతో.. రాజమౌళి కోసం నాగ్ తీవ్రంగా ట్రై చేస్తున్నట్టు టాక్.

నాగ్ తో పాటు పరిశ్రమకు చెందిన మరికొందరు హీరోలు, నిర్మాతలు కూడా గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. ఇలా ట్రై చేస్తున్న వాళ్లలో బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు