కొడుకు మీద బెంగ లేదు..నాగ్

Nagarjuna says there is nothing to worry about Akhil's career
Thursday, August 8, 2019 - 08:00

అఖిల్ నటించిన మూడుకి మూడు ఢమాలే. దాంతో అఖిల్ హీరోగా నిలబడుతాడా అన్న కామెంట్స్ తరుచుగా వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ పై నాగ్ స్పందించాడు. నేను హీరోగా ఎంట్రీ ఇచ్చినపుడు ఇలాంటే మాటలే మాట్లాడారు. ఫస్ట్ లో అన్నీ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. నాగ చైతన్య విషయంలో కూడా అదే జరిగింది. ఇపుడు చైతన్య ఎలా స్టార్ గా నిలబడ్డాడో చెప్పండి. అఖిల్ కి కూడా ఇదొక ఫేజ్. వర్రీ కావాల్సిందేమీ లేదు. నా కొడుకు గురించి అసలు బెంగే లేదు. హి ఈజ్ డూయింగ్ వెల్ అంటూ వెనకొసుకొచ్చాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ అఖిల్ తో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతల మాటేంటి? అది మాత్రం అడగొద్దు. అలాంటి వాటిని కావాలనే స్కిప్ చేస్తుంటాడు నాగ్... ఇటీవల త్రివిక్రమ్ విషయంలో తప్పించుకున్నట్టు.