నగ్మా పిలిస్తే ఆయన వస్తాడా?

మీరు పాలిటిక్స్‌లోకి రావాల్సిందే అని ప్రధాని మోదీ గట్టిగా ఇబ్బంది పెట్టాడు రజనీకాంత్‌ని. అయినా టెంప్ట్ అవలేదు. బీజేపీ దూతలు కూడా రంగంలోకి దిగి రకరకాల లెక్కలు విడమర్చి చెప్పారు. ఊ అనలేదు, నో అనలేదు. ద్వారములు తెరిచే ఉన్నాయి అన్నట్లు తన సమాధానాన్ని
పెండింగ్‌లో పెట్టాడు రజనీకాంత్.
మోదీ చెప్పినా ఎంట్రీ ఇవ్వని ఈ బాషా.. తన బాషా హీరోయిన్ రమ్మంటే వస్తాడా? ఏమో నగ్మా తనకి ఆ సమ్మోహన శక్తి ఉందని భావించినట్లు ఉంది. రజనీకాంత్‌ని మర్యాదపూర్వకంగా చెన్నైలో కలిసింది. పలు విషయాలను చర్చించాను అని ట్విట్టర్‌లో రాసుకొంది. రాజకీయాల్లోకి రావాలని వెల్‌కమ్ చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు.
రజనీకాంత్ ఎప్పటిలానే మౌనమే తన సమాధానం అన్నట్లు స్పందించడం లేదు. వచ్చిన ప్రతివారితో శాలువా కప్పించుకుంటున్నాడు, బొకేలు తీసుకొని, ఆప్యాయంగా వారితో ముచ్చటించి సాదరంగా వీడ్కోలు పలుకుతున్నాడు. పొలిటికల్ ఎంట్రీపై ఎవరికీ హామీ ఇవ్వడం లేదు. ఈ మంత్‌లోనే ఆయన కబాలి దర్శకుడితో మరో సినిమాకి కొబ్బరికాయ కొడుతున్నాడు.
- Log in to post comments