రజనీకాంత్ పార్టీలో నమిత, మీనా!

Namitha, Meena to join Rajinikanth's party
Friday, May 26, 2017 - 00:15

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా పార్టీ పెట్టలేదు. మొన్న జరిగిన అభిమానుల భేటీలో కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు మాత్రం రజనీకాంత్ పార్టీలోకి తాము చేరుతున్నట్టు ప్రకటించారు. వాళ్లే నమిత, మీనా.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది నమిత. కోలీవుడ్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ జపం చేస్తోంది ఈ బొద్దు బ్యూటీ. అటు మీనా కూడా రజనీకాంత్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించింది. రజనీతో ముత్తు సినిమా చేసిన ఈ మాజీ హీరోయిన్.. రజనీకాంత్ ఎప్పుడు పార్టీ పెట్టినా అందులో తను చేరిపోతానని అంటోంది.

ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం.. ఆగస్ట్ 15న రజనీకాంత్ తన కొత్త పార్టీని ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీ పేరు, విధి విధానాల్ని ఖరారు చేసేందుకు తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వ్యక్తులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.