బరువు తగ్గుతున్న నమిత

Namitha on mission of losing weight
Saturday, August 17, 2019 - 09:45

నమిత అనగానే భారీ అందం అన్న ఫ్రేమ్ కాళ్ళ ముందు కదులుతుంది. మంచి పొడువు, దానికి తగ్గ బరువుతో మొదట సెక్సీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆమె ఓవర్ వెయిట్ అయింది. రీసెంట్ గా బాగా ఉబ్బింది. దాంతో ఆమెకి ఛాన్సులు మొత్తం పోయాయి.  రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైన నమిత మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బాలకృష్ణ కొత్త సినిమాలో రోల్ కోసం ప్రయత్నిస్తే.... ఇంత లావు ఉంటే కష్టం అన్నారట. దాంతో ఇప్పుడు ఆఫర్ల కోసం జిమ్ బాట పట్టింది. 

నమిత గతంలో సింహా సినిమాలో బాలయ్యతో ఆక్ట్ చేసింది. అదే ఆశతో సినిమా ఏక్స్ పెక్ట్ చేసింది. 

నమిత ఆ మధ్య పాలిటిక్స్ లో కూడా తన లెగ్ పెట్టింది. కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు.