మోక్షజ్ఞ ఎంట్రీ: బాలయ్య వెరైటీ ఆన్సర్

Nandamuri Balakrishna respons on his son Mokshagna's entry
Tuesday, June 9, 2020 - 09:45

పూరి జగన్నాధ్ ను అంతా ముద్దుగా పూరి అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. మరి అలాంటి పేరును వెటకారం చేస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అదే చేశాడు బాలకృష్ణ. యాంకర్ అడిగిన ప్రశ్నకు వెటకారంగా.. పూరి, ఇడ్లి, ఉప్మా అంటూ స్పందించారు. ఇంతకీ యాంకర్ ఏం అడిగింది?

యాంకర్: మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? పూరి జగన్నాధ్ తో ఎంట్రీ ఉంటుందని అంటున్నారు?
బాలయ్య: ఇడ్లీ, ఉప్మా.. ఈ పేర్లు కూడా చెప్పండి.. వాళ్ల డైరక్షన్ లో కూడా వస్తుందని చెప్పండి. అన్నట్టు మరిచిపోయా, సాంబార్ కూడా చెప్పండి.

చూశారుగా.. ఇది బాలయ్య సమాధానం. బాలయ్య అంటే పూరికి ప్రత్యేకమైన అభిమానం. అతడితో ఓ సినిమా కూడా చేశాడు. మరో సినిమాకు రెడీ అవుతున్నాడు కూడా. అలాంటి దర్శకుడిపై బాలయ్య ఇలా వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఏదైనా అనాల్సి వస్తే అస్సలు ఆలోచించరనడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా మారింది.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందిస్తూ.. "ఎవరితో ఏం చేయాలో నాకు తెలుసు. అద్భుతమైన ప్లాన్ ఉంది. బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ తీసి పెట్టాను. దానికి టైమ్ ఉంది. వాడు వస్తాడు.." అంటూ స్పందించారు బాలయ్య.