బాల‌య్య స‌ర్జ‌రీ స‌క్సెస్‌

Nandamuri Balakrishna undergoes shoulder surgery
Saturday, February 3, 2018 - 19:00

నంద‌మూరి బాలకృష్ణ‌ కుడిభుజానికి స‌ర్జ‌రీ జ‌రిగింది. శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్లో శ‌స్త్ర చికిత్స‌ని స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ లో గాయ‌ప‌డ్డారు బాల‌య్య‌. అప్పట్నుంచి రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో ప్రాథ‌మిక చికిత్స తీసుకున్నారు. రీసెంట్‌గా స‌మ‌స్య జ‌ఠిలం కావ‌డంతో స‌ర్జ‌రీ నిర్వ‌హించాల‌ని వైద్యులు తేల్చారు.

క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే) ఆయ‌న కుడి భుజానికి స‌ర్జ‌రీ చేశారు. గంట‌సేపు జ‌రిగిన ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంద‌ని వైద్యులు తెలిపారు. కొద్దిరోజులు పాటు విశ్రాంతి తీసుకుంటారు బాల‌య్య‌. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టించ‌నున్న బాల‌య్య ఆ సినిమాకి ముందు స‌ర్జ‌రీ చేయించ‌కున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ వ‌చ్చే నెల‌లో లాంఛ‌నంగా ప్రారంభం కానుంది.