బాలయ్య సినిమాపై కరోనా ఎఫెక్ట్

Nandamuri Balakrishna's film gets affected by corona
Thursday, April 23, 2020 - 11:30

టాలీవుడ్ మొత్తాన్ని కరోనా గట్టిగా తాకింది.  ఈ వైరస్ దెబ్బకు థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్స్ బంద్. వందల కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి. ఒక్కో సినిమాపై ఒక్కో రకంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇందులో ఓ రకం బాలయ్య-బోయపాటి సినిమాపై పడింది.

ఎందుకంటే ఈ సినిమాకు వారణాసిలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట. అక్కడ షూటింగ్ కు అనుమతి వస్తుందా రాదా అనేది అనుమానం.ఈ కరోనా ప్రభావం చాలా కాలం ఉండేలా ఉంది. ఇప్పట్లో పబ్లిక్ ప్లేసెస్ లో షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వక పోవచ్చు.

సొంత రాష్ట్రంలో ప్రభుత్వ అనుమతితో ఎక్కడైనా షూటింగ్ చేసుకోవచ్చు. కానీ మరో రాష్ట్రంలో షూట్ చేయాలంటే సవాలక్ష సవాళ్లు ఉంటాయి. ఇక్కడే ఇతర రాష్ట్రాలన్నీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు పరభాషా షూటింగ్స్ కు నో చెప్పాలని అనుకుంటున్నాయి. అదే కనుక జరిగితే బాలయ్య సినిమా షూటింగ్ ఇంకొన్నాళ్లు పోస్ట్ పోన్ అయ్యే ప్రమాదముంది.

అలా అని హైదరాబాద్ లోనే కాశి సెట్ వేద్దామంటే బడ్జెట్ తడిసిమోపెడవుతుంది.