నందిత‌కి మ‌రో ఆఫ‌ర్‌

Nanditha gets another offer
Monday, November 5, 2018 - 22:30

"ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా" సినిమాతో మొద‌ట గుర్తింపు తెచ్చుకొంది నందిత శ్వేత‌. ఆ త‌ర్వాత "శ్రీనివాస క‌ల్యాణం"లో న‌టించింది కానీ అది ఆడ‌లేదు. ఐతే న‌టిగా ఫ‌స్ట్‌మూవీతోనే ఇంప్రెష‌న్ కొట్టేసింది నందిత‌. ఇపుడు ఒక కొత్త సంస్థ తీస్తున్న సినిమాలో మెయిన్ లీడ్‌లో న‌టిస్తోంది ఈ భామ‌. 

సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై మెగాభిమాని అహితేజ నిర్మిస్తున్న మూవీలో ఆమె మెయిన్ హీరోయిన్‌. ఈ మూవీ కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని ట్వీట్ చేసింది ఈ భామ‌.  ఈ సినిమాకి దర్శకుడు చిన్నిక్రిష్ణ. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ప్రారంభం రోజునే కంటెంట్ కి రిలేట్ అయ్యే ఒక టీజర్ ని విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి.