నాని కూడా నిర్మాత అవుతాడట

Nani also wants to become Producer
Monday, July 17, 2017 - 18:00

హీరోలు నిర్మాతలుగా మారడం ఇప్పుడు సర్వసాధారణం. మహేష్ బాబు తన ప్రతి సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా తండ్రి చిరంజీవితో సినిమాలు నిర్మిస్తున్నాడు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తనే హీరోగా నటిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. రానా కూడా త్వరలోనే నాగచైతన్యతో సినిమా చేయబోతున్నాడు. ఇలా చాలామంది హీరోలు ప్రొడ్యూసర్లుగా మారుతున్న ఈ తరుణంలో.. ఈ లిస్ట్ లోకి నాని కూడా చేరాడు. 

తన మనసును టచ్ చేసే స్టోరీలైన్ దొరికితే కచ్చితంగా నిర్మాతగా మారతానంటున్నాడు నాని. అయితే ఆ స్టోరీలైన్ ను ప్రొడ్యూస్ చేయడానికి మరో నిర్మాతలు భయపడాలని, అలా ఎవరూ ముందుకురాని టైమ్ లో తను నిర్మాతగా మారాతనంటున్నాడు నాని. అయితే తను నిర్మించే సినిమాలో కేవలం నిర్మాతగానే ఉంటానని, హీరోగా మరొకర్ని పెడతానంటున్నాడు ఈ నేచురల్ స్టార్.

వరుస హిట్స్ తో రెమ్యూనరేషన్ పెంచిన నాని, ఈ మధ్యే హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలో భారీ భవంతిని కొనుగోలు చేశాడు. ఇప్పుడేమో ఏకంగా సినిమాలు నిర్మిస్తానంటున్నాడు. ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నట్టున్నాడు ఈ హీరో.