రానా, నాని ఫ్రెండ్సిప్ రియ‌లేనా

Nani and Rana: Are they real friends?
Wednesday, June 7, 2017 - 23:45

రానా నటిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. అటు నాని నటించిన 'నిన్ను కోరి' సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. ఎవరి సినిమా ప్రమోషన్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. కానీ సేమ్ టైం ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ తమ స్నేహాన్ని చాటుకుంటున్నారు.

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రతి ఒక్కరు టీజర్ బాగుందని, రానా లుక్ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ మూవీకి మరింత హైప్ తీసుకొచ్చే పని చేశాడు నాని. “మీరు టీజర్ మాత్రమే చూశారు. నేను ట్రయిలర్ కూడా చూశా. అది కూడా రిలీజ్ అయితే రచ్చ రచ్చే. ట్రయిలర్ బ్రహ్మాండంగా ఉంది.” రానా కొత్త సినిమాపై నాని ట్వీట్ ఇది. సేమ్ టైం రానా కూడా 'నిన్నుకోరి' లాంటి సబ్జెక్ట్ నాని కోసమే పుట్టిందంటున్నాడు.

వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. రియ‌ల్ ఫ్రెండ్సిప్ వీరిది. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కు యాంకర్లుగా కూడా వర్క్ చేశారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ తమ మధ్య ఎలాంటి ఇగోస్ లేవని అందరి ముందు ప్రూవ్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.