ఆ బ్యానర్ కు సంక్రాంతి సెంటిమెంట్

Nani and Sithara for Sankranthi sentiment
Friday, January 24, 2020 - 08:45

టాలీవుడ్ లో సంక్రాంతి పోటీ అంటే ఆ రేంజ్ వేరు. బడా హీరోలకు మాత్రమే అది సాధ్యం. మహేష్, బన్నీ, రామ్ చరణ్, బాలయ్య లాంటి హీరోలతో పాటు అండర్ డాగ్స్ గా అప్పుడప్పుడు శర్వానంద్ లాంటి హీరోలు కూడా సక్సెస్ లు అందుకున్నారు సంక్రాంతి బరిలో. ఇప్పుడీ పోటీలోకి నాని కూడా రావాలనుకుంటున్నాడు. అవును.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా సిద్ధం చేస్తున్నాడు నాని.

టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్  డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. జూన్-జూలై మధ్యలో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. సితార ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ ఇలా ఫిక్స్ అవ్వడానికి ప్రధాన కారణం అల వైకుంఠపురములో.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్టయింది. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. అందుకే ఇదే నిర్మాతలకు సంబంధించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నుంచి రాబోతున్న నాని-రాహుల్ సంకృత్యాన్ సినిమాను సంక్రాంతికి రెడీ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇదే కనుక నిజమైతే.. అటు నానికి, ఇటు సితార బ్యానర్ కు ఇదే తొలి సంక్రాంతి సినిమా అవుతుంది.