టక్ తో షూటింగ్ కెళ్లిన నాని

Nani begins shooting of Tuck Jagadish
Tuesday, February 11, 2020 - 19:15

నాని గ్యాప్ తీసుకోలేదు. V సినిమా పూర్తయిన వెంటనే కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈరోజు నాని కొత్త సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు పొలాచ్చిలో మొదలైంది. ఫస్ట్ డే షూట్ లో నానితో పాటు హీరోయిన్ రీతూ వర్మ కూడా ఉంది.

ఫస్ట్ డే ఫస్ట్ షూట్ అంటూ రీతూవర్మ కొన్ని ఫొటోలు షేర్ చేయగా.. పొలాచ్చికి వెళ్తూ ఎయిర్ పోర్టులో నాని కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్నుకోరి తర్వాత నిర్వాణ-నాని కలిసి చేస్తున్న సినిమా ఇది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఐశ్వర్యరాజేష్ నటించనుంది. ఆమె సెకెండ్ షెడ్యూల్ నుంచి ఎంటర్ అవుతుంది.

ఇకపై తన ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే పెట్టబోతున్నాడు నాని. మధ్యలో 2 సార్లు మాత్రం గ్యాప్ తీసుకుంటాడు. తను నిర్మాతగా తీస్తున్న HIT (ఈనెల 28 రిలీజ్) సినిమా ప్రమోషన్ కోసం, తన 25వ చిత్రం V మూవీ (మార్చి 25) ప్రచారం కోసం మాత్రమే గ్యాప్ తీసుకుంటాడు.

V మూవీ తర్వాత గ్యాప్ లేకుండా టక్ జగదీష్ ను కంప్లీట్ చేసి, ఆగస్ట్ నాటికి మూవీని రెడీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ 2 ట్యూన్స్ ఇచ్చాడు.