నాని అశ్వనీదత్ ఫార్ములా

Nani following Ashwini Dutt formula
Saturday, February 29, 2020 - 18:45

కొన్ని రోజుల కిందటి సంగతి. మహానటి సినిమా విడుదలకు ముందు శాటిలైట్ డీల్ ఓపెన్ చేశాడు అశ్వనీదత్. దాదాపు 5 కోట్ల రూపాయలు కోట్ చేశాడు.  కానీ అంత మొత్తం ఇచ్చేందుకు ఏ ఛానెల్ ముందుకు రాలేదు. దీంతో అశ్వనీదత్ రిస్క్ చేశాడు. రిలీజ్ వరకు రైట్స్ అమ్మలేదు. కట్ చేస్తే, సినిమా బ్లాక్ బస్టర్ అయింది, శాటిలైట్ రైట్స్ ఏకంగా 6 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి.

ఇప్పుడు నాని కూడా అశ్వనీదత్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. విడుదలకు ముందు హిట్ సినిమా శాటిలైట్ బిజినెస్ ను ఓపెన్ చేసిన నాని, ఆశించిన స్థాయిలో కోట్స్ అందుకోలేకపోయాడు. నెట్ ఫ్లిక్స్ మాత్రం డిజిటల్ కింద 2 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఛానెళ్లు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో డిజిటల్+శాటిలైట్ పూర్తిచేయకుండానే రిలీజ్ కు వెళ్లాడు నాని.

నాని ప్లానింగ్ ఫలించింది. హిట్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను తీసుకునేందుకు ఛానెళ్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అటు నాని కూడా ఇంతకుముందు చెప్పిన ఎమౌంట్ కంటే 30శాతం అదనంగా చెబుతున్నాడు. అయినప్పటికీ డీల్స్ ఓకే అయ్యే అవకాశాలున్నాయి. దాదాపు స్టార్ మా ఛానెల్ ఈ సినిమా రైట్స్ దక్కించుకునే ఛాన్స్ ఉంది.