నాని జాగ్రత్త పడాల్సిన టైమొచ్చింది

Nani needs to tread carefully now
Tuesday, September 17, 2019 - 21:45

నాని అద్భుతమైన నటుడు. ఎలాంటి పాత్ర ఇచ్చినా... సూపర్‌గా పర్‌ఫామ్‌ చేస్తాడు. డల్‌ సీన్లని కూడా తన నటనతో లేపుతాడు. ఇది అనేకసార్లు ప్రూవ్‌ అయింది. ఇక కథాబలం ఉన్న జెర్సీ వంటి సినిమాలు వస్తే విజృంభించి నటిస్తాడు. నటన పరంగా నానిని ఎక్కడా వంక పెట్టడానికి లేదు కానీ కలెక్షన్ల పరంగా మాత్రం నానికి కష్టకాలం నడుస్తోంది అనిపిస్తోంది. 

నాని కెరియర్‌లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్‌ హిట్‌...దిల్‌రాజు నిర్మించిన ఎం.సీ.ఏ. ఈ సినిమా దాదాపు 35 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. ఆ తర్వాత విడుదలైన సినిమాలు ఏవీ 30 కోట్ల రూపాయల మార్క్‌ దాటలేదు. కృష్ణార్జున యుద్దం ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత దేవదాస్‌ నిరాశపర్చింది. జెర్సీ..విమర్శకుల ప్రశంసలు అందుకొంది. కలెక్షన్ల పరంగా యావరేజ్‌ అయింది. అంటే నాని సినిమాల ..బాక్సాఫీస్‌ రేంజ్‌లో కొంత స్తబ్ధత వచ్చింది. దీన్ని అధిగమించాలి. మార్కెట్‌ రేంజ్‌ని పెంచుకోవాలి. ఇదే అతని టార్గెట్‌ కావాలిపుడు. 

నాని నటించిన తాజా చిత్రం... గ్యాంగ్‌లీడర్‌. మొదటి మూడు రోజులు సూపర్‌ కలెక్షన్లు పొందింది. ఐతే ఆ తర్వాత కలెక్షన్లలో బాగా డ్రాప్‌ వచ్చింది. ఈ సినిమా కూడా పాతిక కోట్ల రేంజ్‌లోనే ఆగేలా ఉంది. సో.. నాని ఇకపై ఒప్పుకునే సినిమాల విషయంలో జాగ్రత్త పడాల్సిందే.