మరో కోణాన్ని బయటపెట్టిన నాని

Nani reveals the other side of him
Wednesday, March 25, 2020 - 18:00

ఏదో సినిమాలో ఇట్స్ లాఫింగ్ టైమ్ అంటాడు హీరో రవితేజ. అదే టైపులో ఇప్పుడు హీరోహీరోయిన్లంతా ఇట్స్ క్వారంటైన్ టైమ్ అంటున్నారు. పనిలోపనిగా ఇంట్లో తాము చేస్తున్న పనుల్ని వివరిస్తున్నారు. కొంతమంది ఇంట్లో జిమ్ చేస్తుంటే, మరికొందరు పుస్తకాల పురుగులైపోయారు. ఈ క్రమంలో తనలోని ఓ కొత్త కోణాన్ని బయటపెట్టాడు నాని.

ఇంట్లో ఖాళీగా ఉన్న నేచురల్ స్టార్ కిచెన్ లోకి వచ్చాడు. గరిట తిప్పుతూ నలభీముడిగా మారిపోయాడు. ఏకంగా చెన్నామసాలా కర్రీ చేశాడు. నిజానికి తనకు స్టవ్ ఆన్ చేయడం కూడా రాదని, క్వారంటైన్ కారణంగా దాదాపు కుక్ అయిపోయానని చెప్పుకొచ్చాడు నాని.

ఇంతకంటే ముందు తన బాల్కనీలో ఉన్న పక్షి గూడు, అందులో ఉన్న పక్షి పిల్లను వీడియో తీసి పెట్టాడు నాని. మంచి నేచర్ ను మిస్సయ్యానంటూ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడిలా వంటింట్లోకి వెళ్లి కుక్ గా మారిపోయాడు. రాబోయే రోజుల్లో ఈ నేచురల్ స్టార్ నుంచి ఇంకెన్ని అవతారాలు బయటపడతాయో చూడాలి.