ఈసారి ఓవర్సీస్ పై కన్నేసిన నాని

Nani sets eyes on overseas market
Tuesday, February 18, 2020 - 15:30

సాధారణంగా రిలీజ్ డేట్స్ విషయంలో పండగలు, పబ్లిక్ హాలిడేస్ చూసుకుంటారు. ఇవేవీ సెట్ అవ్వకపోతే వేసవి శెలవులో లేక వీకెండ్ కలిసొచ్చేలా ప్లాన్ చేస్తారు. కానీ నాని మాత్రం ఈసారి కాస్త కొత్తగా ఆలోచించాడు. యూఎస్ లో హాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకొని తన సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేస్తున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను జులై 3న విడుదల చేయాలని అనుకుంటున్నారు. జులై ఫస్ట్ వీకెండ్ మొత్తం యూఎస్ లో ఇండిపెండెన్స్ డే సీజన్ నడుస్తుంది. అక్కడున్న తెలుగు జనాలంతా కాస్త ఫ్రీగా ఉండే టైమ్ అది. అందుకే ఆ టైమ్ కు తన సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నాడు నాని.

దిల్ రాజు బ్యానర్ పై చేస్తున్న V సినిమాను ఉగాదికి ప్లాన్ చేసిన నేచురల్ స్టార్.. ఆ తర్వాత రానున్న టక్ జగదీష్ సినిమాను యూఎస్ ఇండిపెండెన్స్ డేకు ప్లాన్ చేశాడు. ఇలా నాని కూడా తన సినిమాలకు ఫెస్టివ్ కనెక్ట్ ఉండేలా చూసుకుంటున్నాడు.