అదిరిపోయే డేట్ లాక్ చేసిన నాని?

Nani's MCA Movie Release Date?
Saturday, July 15, 2017 - 16:30

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని మరో సక్సెస్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా తన కొత్త సినిమా రిలీజ్ కోసం అదిరిపోయే డేట్ లాక్ చేశాడు ఈ హీరో. అదే డిసెంబర్ 28. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీని డిసెంబర్ 28న విడుదల చేయాలని నిర్ణయించారు. 

డిసెంబర్ 28 గురువారం పడింది. ఆ తర్వాత శని, ఆదివారం వీకెండ్స్ కలిసొస్తున్నాయి. ఆ వెంటనే జనవరి 1 వస్తోంది. ఇలా లాంగ్ వీకెండ్ తో పాటు సెలబ్రేషన్ మూడ్ కలిసొస్తోంది నాని సినిమాకు. పైగా ఓవర్సీస్ లో  ఈ డేట్ బాగా వర్కవుట్ అవుతుంది. ఇక్కడంటే కేవలం 31 రాత్రి మాత్రమే సందడి. అదే విదేశాల్లో అయితే జనవరి 1కు అటు ఇటు చెరో 2 రోజులు వేడుక ఉంటుంది. ఇలాంటి టైమ్ లో ఎంసీఏ విడుదల చేస్తే ఓవర్సీస్ వసూళ్లు బాగా వస్తాయనేది దిల్ రాజు ప్లాన్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. 30శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.