అమ్మకు బంగారు పాదాలు

Naresh and Vijaya Nirmala statue
Thursday, February 20, 2020 - 21:45

తన తల్లి విజయనిర్మలపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు నటుడు వీకే నరేష్. భర్త కృష్ణ విజయనిర్మల కాంశ్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తే, తల్లికి ప్రేమతో అంటూ నరేష్ ఆమెకు ఏకంగా బంగారు పాదాలు చేయించాడు. నానక్ రామ్ గూడలోని కృష్ణ-విజయనిర్మల నివాసంలో విజయనిర్మల కాంస్యవిగ్రహాన్ని, ఆ విగ్రహం ముందు ఆమె బంగారు పాదాల్ని ఆవిష్కరించారు. 

తనకు తల్లే తనకు సర్వస్వం అని చెప్పుకునే వీకే నరేష్.. ఆమె రూపంతో పాటు.. ఆమె పాదాల్ని రోజూ దర్శించుకోవడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. అందుకే బంగారు పాదాలు చేయించుకున్నానని అశృనయనాలతో చెప్పుకున్నారు.

వీకే నరేష్ చేయించిన బంగారు పాదాల గురించి మహేష్ ప్రస్తావించకపోయినా.. నటుడు కృష్ణంరాజు మాత్రం ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులంటే అభిమానం ఉంటుందని, నరేష్ ఇలా తన తల్లికి బంగారు పాదాలు చేయించి పూజించడం గొప్ప విషయం అన్నారు.