బోలెడన్ని అఫైర్లు, బ్రేకప్ లు నిజమే!

Navdeep talks about his love affairs
Wednesday, June 3, 2020 - 22:15

"జై" సినిమాతో అడుగు పెట్టాడు నవదీప్. ఇప్పుడు అతనికి 34 ఏళ్ళు. ఈ గ్యాప్ లో చాలా పుకార్లు వచ్చాయి. అందులో కొన్ని నిజమే అని హింట్ ఇచ్చాడు నవదీప్. తను ఇప్పటికే చాలాసార్లు ప్రేమలో పడ్డానని, చాలాసార్లు బ్రేకప్స్ అయ్యాయని.. అలాంటి తనను పట్టుకొని ఎలాంటి అమ్మాయి కావాలని మాత్రం అడగొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ నటుడు.

"నాకు 34 ఏళ్లొచ్చాయి. చాలాసార్లు ప్రేమలో పడ్డాను. చాలాసార్లు బ్రేకప్స్ అయ్యాయి. నన్ను పట్టుకొని ఎలాంటి అమ్మాయి కావాలని అడిగితే ఏం చెబుతాను. ఇంటర్మీడియట్ శ్లామ్ బుక్ లో రాసుకున్నట్టు కాదు కదా.. చాలా వయసైపోయింది. ఒక్కో టైమ్ లో ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. వెంటనే చెప్పడం కష్టం," ఇలా తన అఫైర్ల చిట్టా విప్పాడు. మరి పెళ్లి మీద థాట్ లేదా? "పేరెంట్స్ అప్పట్లో అడిగారు. వాళ్లకు చెప్పాల్సింది చెప్పాను. అంతే, అప్పట్నుంచి మళ్లీ పెళ్లి టాపిక్ రాలేదు," అని సమాధానం ఇచ్చాడు నవదీప్. 

ప్రస్తుతం సినిమాల కంటే ఓటీటీ కంటెంట్ తో బిజీగా ఉన్నాడు నవదీప్. రీసెంట్ గా "రన్" అనే ఓటీటీ మూవీ కూడా చేశాడు. ఈ సినిమా పరమ బోర్ అని తెలుగుసినిమా.కామ్ రివ్యూ రాసింది. ("రన్" - ఓటీటీ మూవీ రివ్యూ)