నయన్, విగ్నేష్ ప్రేమకథకి ఐదేళ్లు

Nayanthara and Vignesh celebrate 5th V-day togeter
Friday, February 14, 2020 - 19:15

మా ప్రేమకి ఐదేళ్లు అంటూ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ పోస్ట్ చేశాడు. నయనతార, విగ్నేష్ సహజీవనం చేస్తున్నారు. 5 ఇయర్స్ క్రితం వీరు డేటింగ్ షురూ చేశారు. "నా క్యూటీ కథకి 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అందమైన జ్ఞాపకాలతో నిండిపోయింది, నీ ప్రేమతో మునిగింది. నీతో ప్రతి రోజూ వాలెంటైన్ డేలానే ఉంది నయనతార," అంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను పెట్టాడు.

వీరి పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు అని కూడా టాక్ నడిచింది. కానీ విగ్నేష్ తమది 5 ఇయర్స్ అఫ్ లవ్ అంటూ కవిత్వాలు రాస్తున్నాడు. అన్నట్లు ఈ ప్రేమికుల రోజు కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. నయనతార, సమంత, విజయ్ సేతుపతిలతో తన డైరెక్షన్లో సినిమా ప్రకటించాడు.

నయనతార వర్సెస్ సమంత అంటూ ప్రచారం చేస్తున్నాడు.