నయన బాయ్ ఫ్రెండ్ బయటికొచ్చాడు

Nayanthara boyfriend Vignesh gives clarity
Wednesday, January 8, 2020 - 23:15

నయనతార పర్సనల్ గా ఎప్పుడు ఫొటో దిగినా పక్కన విఘ్నేష్ శివన్ ఉండాల్సిందే. వీళ్లిద్దరి మధ్య ఉన్న "బంధం" అలాంటిది. ఇప్పటివరకు అలానే చాలా ఫొటోలు వచ్చాయి. ఒక్కసారిగా నయన్ సోలో ఫొటోలు వస్తే పరిస్థితేంటి? జనాలకు అనుమానం రాకుండా ఉంటుందా? వచ్చింది. ఆ వెంటనే రూమర్ మొదలైంది.

నయన్-విఘ్నేష్ విడిపోయారంట. కోలీవుడ్ లో వైరల్ అయిన గాసిప్ ఇది. సహజంగా తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్లకు నయనతార ఎప్పుడూ రియాక్ట్ అవ్వదు. ప్రభుదేవాతో వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్లి ఆగిపోయినా కూడా రియాక్ట్ అవ్వలేదు నయన్. సో.. ఈ పుకారుపై కూడా ఆమె సైలెంట్ గానే ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఊహించని విధంగా నయన్ రియాక్ట్ అయింది.

జీ సినీ అవార్డ్స్ సౌత్ కోలీవుడ్ అవార్డుల ఫంక్షన్ కు హాజరైంది నయనతార. శ్రీదేవి పేరిట ప్రవేశపెట్టిన అవార్డ్ అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విఘ్నేష్ శివన్ తో తనకున్న అనుబంధాన్ని పరోక్షంగా గుర్తుచేసుకుంది. తను ఇప్పుడు ఈ పొజిషన్ కు రావడానికి సహకరించిన విఘ్నేష్ శివన్ కు కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. నయనతార విఘ్నేష్ ప్రస్తావన తీసుకొచ్చిందంటే, ఇంకా వాళ్లిద్దరూ కలిసి ఉన్నట్టే లెక్క. అలా తన పరోక్ష ప్రకటనతో ఈ పుకారుకు చెక్ పెట్టింది నయన్.

ఆ వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటో షేర్ చేసి... తాము జంటగానే ఉన్నాము అని చెప్పాడు.