కరోనా టైంలో కల్యాణం

Nayanthara to wed during corona period
Monday, June 1, 2020 - 22:15

నయనతారపై పుకార్లు కొత్తకాదు. మినిమం గ్యాప్స్ లో ఆమెపై గాసిప్స్ వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన తర్వాత నయన్ పై వస్తున్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు వాటన్నింటికీ కొనసాగింపుగా మరో క్రేజీ గాసిప్ తెరపైకొచ్చింది. అదేంటంటే.. ఈ లాక్ డౌన్ టైమ్ లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారట. దీని వెనక ఓ చిన్న లాజిక్ కూడా ఉంది.

పెళ్లి ఎప్పుడు చేసుకున్నా అది గుంభనంగానే ఉండాలనేది నయనతార కండిషన్. కేవలం 20-30 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో అది జరిగిపోవాలని, ఓ 10 మంది మధ్య సింపుల్ గా జరిగినా తనకు అభ్యంతరం లేదనేది నయన్ కండిషన్. దీనికి విఘ్నేష్ కూడా ఒప్పుకున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అతడే ఈ విషయాన్ని బయటపెట్టాడు.

లాక్ డౌన్ వల్ల పెళ్లిళ్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి, పెళ్లి చేసుకోవడానికి ఇదే మంచి టైమ్ అని భావిస్తున్నారట నయన్-విఘ్నేష్. ఈ లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకుంటే... పెళ్లికి ఎందుకు పిలవలేదని ఎవ్వరూ క్వశ్చన్ చేసే ఆస్కారం ఉండదనేది వీళ్ల ప్లాన్.

ప్లాన్ అయితే బాగానే ఉంది. గాసిప్ కూడా నమ్మేలానే ఉంది. దీన్ని ఈ జంట నిజం చేస్తుందా అన్నదే డౌట్.