ఆ హీరోయిన్లు నిజంగా వేశ్య‌లే!

Neha Gnanavel Raja says some actresses are worse than prostitutes
Wednesday, March 21, 2018 - 16:30

కొంద‌రు హీరోయిన్ల క‌న్నా వేశ్య‌లు బెట‌ర్‌. ప‌చ్చ‌ని సంసారంలో నిప్పులు పోసేందుకు ఎపుడూ రెడీగా ఉంటారు కొంద‌రు హీరోయిన్లు. ఏ హీరో దొరుకుతాడా? ఏ నిర్మాత వ‌ల‌లో ప‌డుతాడా అని చూస్తుంటారు. దొరికితే చటుక్కున ప‌ట్టేస్తారు. ట్రాప్‌లో వేసేందుకు ఎపుడు బెడ్ రెడీగా ఉంచుతారు కొంద‌రు సిగ్గు విడిచిన హీరోయిన్లు. వీళ్ల‌ని యాక్ట‌ర్స్ అన‌లేం సెక్స్ వ‌ర్క‌ర్స్ అనాలి.

ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఇది గాసిప్ కాదు. క‌ట్టు క‌థ అంత‌క‌న్నా కాదు. ఒక నిర్మాత భార్య ఇలా చెప్పింది. చెప్ప‌డం అంటే మాట‌ల‌తో కాదు, ట్వీట్ల‌తో. ఆమె ఇంగ్లీషులో వేసిన ట్వీట్స్‌కి అనువాదం ఇది. ఇంగ్లీషులో ఆమె ప‌చ్చిగా రాసింది. మేం కాస్త పాలీష్ చేసి చెప్పామిక్క‌డ‌.

ఇంత‌కీ ఎవ‌రా నిర్మాత భార్య? ఆమె పేరు నేహ జ్ఞాన‌వేల్‌. సింగం, యముడు, సింగం త్రీ వంటి భారీ సినిమాలు నిర్మించిన జ్ఞాన‌వేల్ రాజా భార్య‌. ప్ర‌ముఖ హీరో సూర్యకి వ‌రుస‌కి సోద‌రుడి భార్య అవుతుందామె. వారి కుటుంబం అంతా సినిమా రంగంలోనే ఉంది. అలాంటి నేహ ఇలా ఎందుకు ట్వీట్ చేసిందంటే క‌డుపు మండింద‌ట‌. చిత్ర‌సీమ‌లో త‌న చుట్టూ ఉన్న ఆడ‌వాళ్ల‌కి జ‌రుగుతున్న అన్యాయం చూసి ఆక్రోషం క‌లిగింద‌ట‌. తాను నిజమే చెపుతోంద‌ట‌. ఇది సుచి లీక్స్ కాదు, ఆవేద‌న‌, ఆక్రోషం అంటోందిజ‌

ఐతే ఆమె ట్వీట్ల‌తో క‌ల‌క‌లం రేగ‌డం, అంద‌రూ ఆమె భ‌ర్త‌ని నిందించ‌డంతో వాటిని డిలీట్ చేసింది. తాను, త‌న భ‌ర్త బాగానే ఉన్నామ‌ని కానీ కొంద‌రు పెళ్ల‌యిన మ‌గ సెల‌బ్రిటీల కాపురాల‌ను కూల్చేందుకు కొంద‌రు హీరోయిన్లు వేస్తున్న జిత్తులు చూసి కడుపు మండి అలా ట్వీట్స్ చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది.

ట్వీట్లు తొల‌గించి వివ‌ర‌ణ ఇచ్చే సంద‌ర్బంలోనూ ఆ హీరోయిన్ల‌ని బిచెస్ అని సంభోందిచింది.