నెట్ ఫ్లిక్స్ టాప్-10 సినిమాలివే

Netflix reveals top 10 movies
Saturday, July 18, 2020 - 12:30

ఒరిజినల్ కంటెంట్, మూవీస్ విషయంలో నెట్ ఫ్లిక్స్ మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఓటీటీకి ఉన్న క్రేజ్ మరోసారి బయటపడింది. తాజాగా తన టాప్-10 సినిమాల జాబితాను విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. తమ సినిమాలు విడుదలైన మొదటి నెలలో వచ్చిన నంబర్స్ ను బయటపెట్టింది. ఆ అంకెలు చూస్తే ఎవరైనా కళ్లు తేలేయాల్సిందే.

నెట్ ఫ్లిక్స్ టాప్-10లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది "ఎక్స్ ట్రాక్షన్". ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి కేవలం 4 వారాల వ్యవథిలో 99 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ఇందులో కీలకపాత్ర పోషించాడు.

నెట్ ఫ్లిక్స్ టాప్-10 మూవీస్ (మొదటి 4 వారాల వ్యూస్)

1. ఎక్స్ ట్రాక్షన్ - 99 మిలియన్
2. బర్డ్ బాక్స్ - 89 మిలియన్
3. స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్ - 85 మిలియన్
4. 6-అండర్ గ్రౌండ్ - 83 మిలియన్
5. మర్డర్ మిస్టరీ - 73 మిలియన్
6. ది ఐరిష్ మేన్ - 64.2 మిలియన్
7. ట్రిపుల్ ఫ్రాంటియర్ - 63 మిలియన్
8. ది రాంగ్ మిస్సీ - 59 మిలియన్
9. ది ప్లాట్ ఫామ్ - 56.2 మిలియన్
10. ది పెర్ ఫెక్ట్ డేట్ - 48 మిలియన్