రాజమౌళి... రామాయణం తీయండి!

Netizens ask Rajamouli to make Ramayan
Sunday, May 3, 2020 - 16:00

లాక్డౌన్ వేళ "రామాయణం" ఇప్పుడు మళ్ళీ జనాల్ని ఊపేస్తోంది. డీడీలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ ని కోట్లాది మంది వీక్షిస్తున్నారు. "రామాయణం", "మహాభారత్" సీరియళ్ల పుణ్యాన డీడీ ఛానల్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చింది. ఇప్పుడు  సోషల్ మీడియాలో కూడా ఇది ట్రెండింగ్ టాపిక్ గా మారింది. 

తాజాగా "#RajamouliMakeRamayan" అనేది ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ గ్రాఫిక్స్, టెక్నాలజీని ఉపయోగించి రాజమౌళి ఈ రామాయణాన్నీ తీస్తే అద్భుతంగా ఉంటుంది అనేది సోషల్ మీడియా జనాల వాదన. అందుకే... ఆయనకి టాగ్ చేస్తూ  హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

రాజమౌళికి మహాభారతం తీయాలనేది డ్రీం ప్రాజెక్ట్. రామాయణంలో కన్నా మహాభారతంలో మంచి డ్రామా ఉంది అంటారు రాజమౌళి. విజువల్ గా రిచ్ గా తీసే స్కోప్ మహాభారతంలో ఉంది. రాజమౌళి ఇప్పుడు ఇండియా అంతా పేరు ఇలాంటి గ్రాఫికల్ వండర్స్ కి మారుపేరు  అయ్యారు. అందుకే ఇండియా అంతా #RajamouliMakeRamayan అనేది ట్రెండ్ అవుతోంది.