అప్ డేట్ యావలో అడ్డమైన ఫొటో

Netizens comments on Neha sharma phot
Wednesday, February 26, 2020 - 11:30

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను, తద్వారా అభిమానుల్ని పెంచుకునేందుకు నిత్యం ఏదో ఒక  ఫొటో పెడుతుంటారు హీరోయిన్లు. దీని కోసం వాళ్లు కొందరు వ్యక్తుల్ని కూడా నియమించుకుంటారు. కాస్త క్రేజ్-డబ్బు ఉన్న హీరోయిన్లయితే దీని కోసం ఏకంగా ఓ టీమ్ ను పెట్టుకుంటారు. హీరోయిన్ నేహా శర్మ ఈ విషయంలో కాస్త కక్కుర్తి పడుతున్నట్టుంది.

తాజాగా ఆమె పెట్టిన ఈ స్టిల్ చూస్తే, ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఏదో ఒక ఫొటో పెట్టేయాలనే కంగారులో నేహాశర్మ ఈ ఫొటోను అప్ లోడ్ చేసింది. ఎలాంటి ప్రొఫెషనలిజం లేని ఈ ఫొటో చూసి నెటిజన్లు విసుక్కుంటున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన అతిచెత్త ఫొటో ఇది మాత్రమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రతి రోజూ తన ఫొటోలు పోస్ట్ చేస్తుంది నేహా శర్మ. మొన్నటివరకు అన్నీ మంచి ఫొటోలే పెట్టింది. కానీ ఈ ఒక్క ఫొటో విషయంలో మాత్రం తేడాకొట్టింది. బహుశా.. ఏదో ఒకటి పెట్టేసి మళ్లీ చెక్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది కావొచ్చు