2 రోజుల్లో 13 సినిమాలు రిలీజ్

New Year begins with 13 new releases
Wednesday, January 1, 2020 - 09:00

జనవరి 1న ఏకంగా 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో వర్మ నిర్మించిన బ్యూటిఫుల్ అనే సినిమా ఉంది. దీనిపై పెద్దగా ఎవ్వరికీ ఎలాంటి అంచనాల్లేవు. నైనా గంగూలీ అందాల కోసం చూడాలంతే. అటు సత్యప్రకాష్ దర్శకుడిగా మారి తీసిన ఉల్లాల ఉల్లాల సినిమా కూడా రేపే వస్తోంది. ఇందులో కూడా కాస్త అడల్ట్ డోస్ ఎక్కువగానే ఉంది. వీటితో పాటు రథేరా, అతడే శ్రీమన్నారాయణ, తూటా, రాజా నరసింహా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

ఇక మూడో తేదీన వైఫ్ ఐ అనే సినిమా వస్తోంది. గతంలో ఏడు చేపల కథ అనే అడల్ట్ మూవీలో నటించిన అభిషేక్ ఇందులో హీరో. ఈ సినిమా కూడా అలాంటిదే. అడల్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని, అస్సలు డిసప్పాయింట్ చేయమని చెబుతున్నాడు అభిషేక్.

ఈ మూవీతో పాటు 3న ఉత్తర, సమరం, నమస్తే నేస్తమా, కళాకారుడు, బూమరాంగ్ అనే సినిమాలు థియేటర్లలోకి పోలోమంటూ వస్తున్నాయి. ఇలా న్యూ ఇయర్ స్టార్టింగ్ లోనే ఏకంగా 13 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటితో ఎన్ని క్లిక్ అవుతాయని ఆలోచించడం అనవసరం. సంక్రాంతి సినిమాల సందడి ప్రారంభమయ్యేవరకు అటుఇటుగా ఇవి నడుస్తుంటాయంతే.