మొన్నే పెళ్లి.. అప్పుడే రీఎంట్రీ

Newly married Manali Rathod's new entry
Wednesday, July 15, 2020 - 14:00

ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే అట్నుంచి అటు ఇంటికే. ఆ తర్వాత ఎప్పుడో మళ్లీ 7-8 ఏళ్లకు అమ్మ-అక్క పాత్రలతో రీఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఓవైపు పెళ్లి చేసుకున్నప్పటికీ మరోవైపు కెరీర్ ను కొనసాగిస్తున్నారు తారలు. కుదిరితే హీరోయిన్ పాత్రలు, కుదరకపోతే సెకెండ్ హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ పాత్రలతో బండి లాగించేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మనాలీ రాథోడ్ కూడా చేరిపోయింది.

గతేడాది నవంబర్ లో పెళ్లి చేసుకుంది మనాలీ రాథోడ్. బీజేపీ యూత్ లీడర్ విజిత్, మనాలీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న 8 నెలలకే రీఎంట్రీ ఇస్తోంది మనాలీ.

చూశారా: మనాలి కొత్త ఫోటోషూట్

ఆల్రెడీ ఓటీటీ లో ఓ సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తమిళ్ లో మరో సినిమా పూర్తిచేసింది. ఇప్పుడు తెలుగులో ఆఫర్ల కోసం వెయిటింగ్. నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు ఇవ్వమని కోరుతోంది. తెలుగులో కొందరు దర్శకులు ఆల్రెడీ తనను సంప్రదించారని, కొంతమంది నటీనటులతో కూడా టచ్ లో ఉన్నానని చెబుతోంది మనాలీ.

కానీ ఏ సినిమాకు కమిట్ అయిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.