ఫ్యాన్స్ అతికి నిధి కటింగ్

Nidhhi Agerewal blocks fans who went overboard
Wednesday, May 13, 2020 - 15:45

నిధి అగర్వాల్ కు తెలుగు అర్థమౌతుందా!?

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఓ బ్యాచ్ రెడీగా ఉంటుంది. హీరోయిన్లను తెలుగులో వీళ్లు రకరకాల మాటలు అంటుంటారు. హీరోయిన్లకు ఎలాగూ తెలుగు రాదు కాబట్టి వీళ్ల కామెంట్స్ వాళ్లకు అర్థంకాదని చాలామంది అనుకుంటారు. అది నిజం కూడా. తెలుగులో నటిస్తున్న చాలామంది హీరోయిన్లకు తెలుగు రాదు. అందుకే తెలుగులో వాళ్లను ట్యాగ్ చేస్తూ ఏదైనా కామెంట్ చేసినా వాళ్లకు అర్థంకాక లైట్ తీసుకుంటారు. కానీ నిధి అగర్వాల్ విషయంలో ఇది రివర్స్ అయింది.

అందరు హీరోయిన్లలానే నిధికి కూడా తెలుగు రాదనుకున్నారు కొంతమంది. రీసెంట్ గా జరిగిన ఛాట్స్ లో తెలుగులో రకరకాల కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అలాంటి కామెంట్స్ చేసిన వాళ్లందర్నీ బ్లాక్ చేసి పడేసింది నిధి అగర్వాల్. దీంతో అంతా అవాక్కయ్యారు. యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావ్? నీ సీక్రెట్ ఎఫైర్ నాకు తెలుసు. నీ ఎద సంపద అంత పెద్దగా ఎందుకుంది? ఇలాంటి ప్రశ్నలు వేసిన వాళ్లందర్నీ సింగిల్ క్లిక్ తో బ్లాక్ చేసి పడేసింది ఈ బ్యూటీ. దీంతో నిధి అగర్వాల్ కు తెలుగు వచ్చా రాదా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో ఊపందుకుంది.

నిజానికి ఆమెకు తెలుగు రాదు. కాకపోతే తెలుగు కామెంట్స్ ను ఇంగ్లిష్ లో రాస్తే ఆమె చదివి  అర్థం చేసుకోగలదు. అక్కడే వచ్చింది సమస్యంతా. బ్లాక్ అయిన వాళ్లంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.