నిధి వైపు చూపు?

Nidhi Agerwal bags big movie?
Thursday, February 13, 2020 - 10:00

పవన్ కళ్యాణ్ సినిమాలో సోనాక్షి సిన్హా కన్ఫామ్ అయింది అన్నట్లు  మొన్నటి వరకు రాశాయి ఒక సెక్షన్ అఫ్ మీడియా. నిన్న జాక్వెలిన్ పేరు చెప్పాయి. మధ్యలో పూజ హెగ్డే రిజెక్ట్ చేసింది అన్నాయి. ఇంతవరకు మేకర్స్ మాత్రం నోరు విప్పలేదు. ఇప్పుడు బడ్జెట్ తగ్గించాలనే ఉద్దేశంతో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ని తీసుకుంటున్నారు అని టముకు వేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో చూడాలి. 

ఈ హీరోయిన్ల గోల అంతా క్రిష్ సినిమా గురించే. 

పవన్ కళ్యాణ్ - క్రిష్ సినిమా ఇటీవలే మొదలైంది. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇది 19వ శతాబ్దంలో సాగే  పీరియడ్ మూవీ. ఈ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ రెండేళ్లుగా పెంచుకున్న గడ్డాన్ని తీశారు. ఇప్పటికి 10 రోజుల షూటింగ్ పూర్తి అయింది. ఈ నెల 20 నుంచి మళ్ళీ కొత్త షెడ్యూల్ లో పవన్ పాల్గొంటారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నిధి అగర్వాల్ పాపులర్ అయింది. అంతకుముందు చేసిన మిస్టర్ మజ్ను, సవ్యసాచి సినిమాలు ప్లాప్ అయినా 'ఇస్మార్ట్ శంకర్' కెరీర్ కి కొంత బూస్ట్ తెచ్చింది. ప్రస్తుతం ఈ భామ అశోక్ గల్లా (మహేష్ బాబు మేనల్లుడు) ఫస్ట్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. 

మరి మీడియా ఊహాగానాలు నిజమయ్యి ...పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా సైన్  చేస్తుందా అనేది చూడాలి.