నిధి అగర్వాల్ ప్రేమ పాఠాలు

Nidhi Agerwal gives lessons in dating
Saturday, April 18, 2020 - 11:30

ఓ అమ్మాయిని ప్రేమిస్తే ప్రపోజ్ చేయడం ఎలా. దీనికి కచ్చితమైన సమాధానం అంటూ ఏదీ లేదు. కానీ కొన్ని బేసిక్ విషయాలు ఫాలో అవ్వాలంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఇంతకీ బెస్ట్ ప్రపోజల్ కోసం నిధి చెబుతున్న ఆ మేటర్ ఏంటి? స్మాల్ చిట్ చాట్..

బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో ఏదిష్టం?
ఈ మూడింటిలో నాకు బ్రేక్ ఫాస్ట్ అంటే ఇష్టం. ఎందుకంటే అంత ఆకలిగా ఇంకెప్పుడూ ఉండను. రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయడమే ఇష్టం. కాస్త ఎక్కువగా తింటా కూడా. 

ఇష్టమైన హీరో?
ఒకరు కాదు.. ఇద్దరున్నారు.. రణబీర్ సింగ్, రణ్వీర్ సింగ్

లవ్ ప్రపోజ్ చేయడం ఎలా?
నిజాయితీగా ఉండండి, మనసులో ఉన్నది చెప్పండి, సౌమ్యంగా ఉండండి. పనైపోతుంది.

వెజిటేరియన్ లేదా నాన్-వెజిటేరియన్?
నేను ఒకప్పుడు నాన్-వెజిటేరియన్ తప్ప ఏదీ తినేదాన్ని కాదు. కానీ ఇప్పుడు వెజిటేరియన్ గా మారిపోయాను. ప్రస్తుతం ఓన్లీ వెజ్. మళ్లీ నాన్-వెజ్ లోకి మారతానేమో చెప్పలేం.

బెస్ట్ యాక్టింగ్ స్కూల్ ఏది?
యాక్టింగ్ క్లాసులకు వెళ్లడం కంటే.. ఎక్కువ సినిమాలు చూడడం బెటర్. నేను అదే చేస్తాను. బెస్ట్ యాక్టింగ్ క్లాస్ అంటే బెస్ట్ సినిమాలు చూడడమే.

ఇంట్లో ఏమని పిలుస్తారు?
నా నిక్ నేమ్ నిన్నీ

మీ పెట్ పేరేంటి?
నాకు ఇష్టమైన పెంపుడు జంతువు. మా కుక్క. దాని పేరు హ్యాపీ.

ఎఫ్ బీ, ఇనస్టా, ట్విట్టర్ లో ఏదిష్టం?
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లో నాకు ఇనస్టా అంటేనే బాగా ఇష్టం.