ఈ మైండ్ సేట్టే సమస్య: నిధి

Nidhi Agerwal reacts strongly to the troll
Sunday, December 1, 2019 - 15:30

ప్రియాంక హత్యకు నిధి అగర్వాల్ కు ఏంటి సంబంధం?
 
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసు విషయంలో ప్రజలంతా ఒక్కటయ్యారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఊహించని విధంగా బుక్ అయింది నిధి అగర్వాల్.

ఓవైపు ప్రియాంక రెడ్డి వ్యవహారం సోషల్ మీడియాలో జోరుగా నడుసున్న వేళ.. ఓ హాట్ ఫొటో పెట్టింది నిధి అగర్వాల్. దీనిపై ఓ ఆకతాయి కాస్త అసహ్యంగా స్పందించాడు. ఇలాంటి హాట్ ఫొటోలు పెట్టడం వల్లనే యువత రేప్ లకు పాల్పడుతున్నారని, హాట్ ఫొటోలు షేర్ చేసేముందు ఒకసారి ఆలోచించాలంటూ పోస్ట్ పెట్టాడు.

దీంతో నిధి అగర్వాల్ కు కాలింది. సదరు నెటిజన్ సరదాగా ఆ పోస్ట్ పెట్టినప్పటికీ నిధి మాత్రం సీరియస్ అయింది. ఈ వ్యక్తి ఆలోచనలు భయంకరంగా ఉన్నాయన్న నిధి.. అతడి అడ్రెస్ తనకు చెప్పాలని, పింక్ సినిమాను అతడికి పంపిస్తానని చెప్పుకొచ్చింది. ఆ సినిమాను తప్పకుండా ఈ వ్యక్తి చూడాలని రివర్స్ లో ఘాటుగా సమాధానమిచ్చింది.