మొన్న జెల‌సీ, ఇపుడు స‌పోర్ట్‌!

Nikhil extends support to Vijay Deverakonda
Wednesday, November 14, 2018 - 23:45

ఆ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి వ్య‌తిరేకంగా ట్వీట్ చేసి క‌ల‌క‌లం రేపాడు యువ హీరో నిఖిల్. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్‌ని చూసి జెల‌సీ ఫీల‌వుతున్నాడ‌ని అత‌ని ట్వీట్ ద్వారా అర్థ‌మైంది. కొంత‌సేప‌టికే త‌న ట్వీట్‌ని డిలీట్ చేసుకున్నాడు. ఇపుడు విచిత్రంగా అదే హీరోకి త‌న మ‌ద్ద‌తును తెలుపుతున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన "ట్యాక్సీవాలా" ..నవంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. కానీ ఈ సినిమా మొత్తం టారెంట్స్‌లోకి వ‌చ్చింది. 

ఒక టారెంట్ సైట్ సినిమా పైర‌సీ ప్రింట్‌ని అప్‌లోడ్ చేసింది. సినిమా విడుద‌ల‌కి ఐదు రోజుల ముందే మొత్తం సినిమాని ఆన్‌లైన్‌లో పెట్టింది. షాక్ తిన్న టీమ్‌..ఆ పైర‌సీ ప్రింట్‌ని ఆపేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే త‌మిళ హీరో సూర్య విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. ఈ క‌ష్టం కూడా త్వ‌ర‌లోనే పోతుంది, నువ్వు ఇక్క‌డ రూల్ చేస్తావు అని సూర్య విజ‌య్‌కి సపోర్ట్‌గా ట్వీట్ చేశాడు. 

ఐతే ఆశ్చ‌ర్య‌క‌రంగా నిఖిల్ కూడా అదే పంథాలో విజ‌య్‌కి సపోర్ట్‌గా ఒక వీడియోని షేర్ చేశాడు. పైర‌సీని అరికట్టండి. ఈ సినిమాని సూప‌ర్ హిట్ చేయండ‌ని కోరాడు. త‌న మిత్రుడు రాహుల్ (ద‌ర్శ‌కుడు), నిర్మాత ఎస్‌కే ఎన్‌ల తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రోత్సహించండ‌ని చెప్పాడు. నిఖిల్ ఇలాంటి టైమ్‌లో త‌న‌కి స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో అత‌ని పాత జెల‌సీ యాక్ట్‌ని మ‌రిచిపోయి..విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అత‌నికి థ్యాంక్స్ చెప్పాడు. 

"నోటా" సినిమా అప‌జ‌యం పాలైన త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక ట్వీట్ చేశాడు. "ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో విశ్లేషించుకుంటా, కానీ ఈ సినిమాతో నేను కుంగిపోను.. నా విమ‌ర్శ‌కులకి ఇక న‌న్ను విమ‌ర్శించే అవ‌కాశం ఇవ్వ‌ను. త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌తో వారికి స‌మాధానం చెపుతాను," అంటూ ఒక లెట‌ర్ రాశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అది పూర్తిగా ఆయ‌న సొంత మేట‌ర్‌. అందులో ఏ హీరోని విమ‌ర్శించ‌లేదు. కానీ నిఖిల్ దానికి స్పందిస్తూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు పెట్టకుండా విమ‌ర్శించాడు. అది ర‌చ్చ ర‌చ్చ అయింది. దాంతో నిఖిల్ త‌న ట్వీట్‌ని డిలీట్ చేశాడు. 

అప్ప‌ట్నుంచి నిఖిల్..తన‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్ అంటే జెల‌సీ లేదు అని ప్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.