సిక్స్ ప్యాక్లో సగం అయిందిట

Nikhil Siddharth's six-pack work is in progress
Saturday, April 4, 2020 - 16:00

నిఖిల్ సిద్ధార్థ్ సిక్స్ ప్యాక్ కోసం కుస్తీ పడుతున్నాడు. ఈ లక్డౌన్ పీరియడ్ లో ఇదే టార్గెట్ గా పెట్టుకున్నాడు. పెళ్లి కూడా వాయిదా పడింది కాబట్టి ఇప్పుడే ఇదే పనిలో ఉన్నాడు. అయితే ఆరు పలకలు రావాలంటే చాలా కష్టపడాలి. ప్రస్తుతం వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది అంటూ షర్టు ఇప్పేసి ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు నిఖిల్. 

ఆరులో సగం వచ్చాయంట. ఇంకా నాలుగు వారాలు పడుతుంది టార్గెట్ రీచ్ అవడానికి. ఆ లోపు ఈ ఫోటో చూసెయ్యండన్నాడు. ఈ కష్టం అంతా "కార్తికేయ 2" అనే సినిమా కోసమే. నిఖిల్, చందు మొండేటి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న మూవీ కార్తీకేయ 2. ఈ పాత్ర కోసమే ఈ కసరత్తు.

ఏప్రిల్ 16న కావాల్సిన నిఖిల్ పెళ్లి వాయిదా పడింది. కొత్త తేదీ ఇప్పుడే చెప్పలేమంటున్నాడు. ఈ కరోనా వ్యాధి తగ్గి అన్ని పరిస్థితులు స్థితపడాలి.