శ్వాస కూడా ఆగింద‌ట‌

Nikhil Siddharth's Swasa stalled
Monday, June 24, 2019 - 15:00

నిఖిల్ సిద్దార్థ్ కెరియ‌ర్ ఎదుగుబొదుగూ లేకుండా సాగుతోంది. ప‌దేళ్ల నుంచి ప‌ది కోట్ల మార్కెట్ బ్రాకెట్లోనే ఉన్నాడు నిఖిల్‌. ఇపుడు అది కూడా ఉందా అనేది డౌట్‌. సామాజిక సమ‌స్య‌ల‌పై సోష‌ల్ మీడియా ద్వారా స్పందించే నిఖిల్ సిద్దార్థ్‌కి త‌న సినిమాల విష‌యంలోనే ఏమీ పాలుపోవ‌డం లేద‌ట‌. 

ఆరు నెలుల‌గా ఇదిగో పులి అన్న రీతిలో "అర్జున్ సుర‌వ‌రం" రిలీజ్ అంటూ ఊరించిన నిఖిల్ ఇపుడు దాని గురించి ఊసెత్త‌డం లేదు. అది రిలీజ్ అవుతుందా అనేది బిగ్ క్వ‌శ్చ‌న్ మార్క్‌. ఒక వేళ ఏదో ఒక రూట్ చూసుకొని విడుద‌లైనా...దానికి బ‌జ్ వ‌స్తుందా అనేది కూడా డౌటే. ఇదే టైమ్‌లో ఇంకో సినిమా షూటింగ్ ద‌శ‌లోనే అట‌కెక్కింద‌ట‌.

నిఖిల్ ఆ మ‌ధ్య "శ్వాస" అనే సినిమా మొద‌లుపెట్టాడు. ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత ప‌క్క‌న పెట్టాడ‌ట‌. ద‌ర్శకుడికి, అత‌నికి విభేదాలు వ‌చ్చి సినిమాని అట‌కెక్కించార‌ట‌. ఇక కార్తీకేయ సినిమాకి సీక్వెల్ తీద్దామ‌న్న ప్లాన్స్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. దానికి బడ్జెట్ స‌మ‌స్య‌లంట‌.