టంగ్‌ స్లిప్‌తో పవన్‌ హీరోయిన్‌కి కష్టాలు

Nikisha Patel gets trolled over Pawan's tweet
Tuesday, September 3, 2019 - 19:30

పవన్‌ కల్యాణ్‌ కెరియర్‌లో అత్యంత దారుణమైన ఫ్లాప్‌ల్లో ఒకటి..."కొమరం పులి". ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది నికీషా పటేల్‌. ఈ హీరోయిన్‌ నిన్న పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్బంగా పవర్‌స్టార్‌కి బర్త్‌డే విషెష్‌ తెలిపింది. ఐతే...విషెష్‌ చెప్పే క్రమంలో పావలా కల్యాణ్‌ అంటూ ట్యాగ్‌ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. పవన్‌ కల్యాణ్‌ అంటే పడని వైరిపక్షాలు తరుచుగా పవన్‌కల్యాణ్‌ని అలా పిలుస్తూ... ఆన్‌లైన్లో ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఆ బ్యాక్‌డ్రాప్‌ తెలియని నికిషా ఆ హ్యాష్‌ట్యాగ్‌ని తన విషెష్‌కి యాడ్‌ చేసింది. అంతే పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. 

దాంతో తప్పయిందని మళ్లీ ట్వీట్‌ చేసింది. ఐనా కూడా ట్రోలింగ్‌ ఆగకపోవడంతో.. కొన్నాళ్ల పాటు ట్విట్టర్‌కి దూరంగా ఉంటానని నమస్తే పెట్టి సైలంటయింది నికీషా.