నిశ్శబ్దంగా వాయిదాపడింది కదా

Nishbadam postponed to next month
Sunday, January 19, 2020 - 15:00

అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా నిశ్శబ్దంగానే ఉంది. ఎలాంటి చప్పుడు చెయ్యడం లేదు. టీం ప్రమోషన్ మొత్తం ఆపేసింది. ఎందుకంటే సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 31న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, అనేక కారణాల వల్ల ... ఈ మూవీ ఈ నెల విడుదల కావడం లేదు... తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల కానుంది ఈ మూవీ. ఇతర భాషల్లో ఇంకా ప్రమోషన్ మొదలు కాలేదు. అందుకే అన్ని ఆలోచించుకొని మూవీని వాయిదా వేశారు. 

కుదిరితే, శివరాత్రి కానుకగా రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. లేదంటే సమ్మర్ కి వెళ్లొచ్చు. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ ఒక థ్రిల్లర్. మాధవన్, అంజలి, షాలిని పాండే, హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసెన్ నటించిన ఈ మూవీకి కథ అందించింది కోన వెంకట్. ఆయనే ఈ సినిమాకి సమర్పకుడు. హేమంత్ మధుకర్ దర్శకుడు.